అడవి జంతువులను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణా జిల్లా అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నిజమాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కృష్ణా జిల్లా గన్నవరానికి మినీ ఆటోలో వాటిని తరలిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఇబ్రహీం పట్నం చెక్‌పోస్ట్ వద్ద నిందితులను పట్టుకున్నారు. అటవీ చట్టం ప్రకారం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు.
అడవి జంతువులు అక్రమ రవాణా... ఇద్దరు అరెస్టు
అక్రమంగా అడవి జంతువులను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు.
అడవి జంతువులు అక్రమ రవాణా... ఇద్దరు అరెస్టు