పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని... తెదేపా అధినేత చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే... చంద్రబాబు ఓర్వలేక తెదేపా నాయకులతో తప్పడు కేసులు బనాయించి సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడ్డ 16 నెలల్లోనే నవరత్నాల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు.
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 42.34 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలు, 3 జతల స్కూల్ యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్స్, బెల్ట్, నోట్‌బుక్‌లు, స్కూల్‌బ్యాగ్... ఇలా వివిధ రకాల వస్తువులని అందిస్తున్నట్లు తెలిపారు.