2015-17 మధ్య కాలంలో వివిధ కారణాలతో దాదాపు 25 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయనిఎన్నికల ప్రధానాధికారారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గిందన్నారు. పట్టణ ప్రాంతాల ఓటర్ల సంఖ్యలో వ్యత్యాసం వచ్చిందని పేర్కోన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండేసి ఓట్లు ఉన్నవారి సంఖ్య లక్షన్నరకు పైగాఉన్నట్లు గుర్తించామన్నారు. ఓటు ధృవీకరణకోసం కాల్ సెంటర్కు 17వేల ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. మార్చి నాటికి 10 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. అకారణంగా ఎవరి ఓటు తొలగించేది లేదని... ఫారం-7 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. ఎంత నగదు తీసుకెళ్లాలనే విషయంపై ఎలాంటి నిబంధన లేదన్నారు. సందేహం వస్తే 10 వేలైనా సీజ్ చేస్తామని.. లెక్కలు ఉంటే 10 లక్షలైనా ఇబ్బంది లేదనితెలిపారు. నగదు లావాదేవీలపై సరైన ఆధారాలు చూపితే బాగుంటుందని సూచించారు. అక్రమ వ్యవహారాలపై పోలీసు, ఎస్సైజ్ శాఖలు నిఘా ఉంచాయని పేర్కోన్నారు.
ఎవరి ఓటు తొలగించం : ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది - vijayawada
మార్చి నాటికి 10 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకొనే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. అకారణంగా ఎవరి ఓటు తొలగించేది లేదన్నారు. ఫారం-7 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని చెప్పారు.
ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది