శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన మందిర నిర్మాణ శంకుస్థాపన జరగనుంది. దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల నుంచి మట్టి, పవిత్ర నదుల నుంచి జలాలను అయోధ్యకు పంపాలని శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సూచించింది. ఇందు కోసం నగర విశ్వహిందూ పరిషత్తు, భజరంగ్‌దళ్ విభాగం సన్నద్ధమైంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన జగజ్జనని- కనకదుర్గమ్మ సన్నిధి నుంచి పవిత్ర మృత్తికను, దుర్గా ఘాట్ వద్ద కృష్ణా జలాన్ని సేకరించింది. ఈ కార్యక్రమంలో శైవ క్షేత్రం పీఠాధిపతులు శివ స్వామి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
శ్రీరామ జన్మభూమి శంకుస్థాపనకు కృష్ణా నది జలం, మృత్తిక సేకరణ - vijayawada latest news
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విజయవాడ దుర్గమ్మ సన్నిద్ధి నుంచి పవిత్ర మృత్తికను, దుర్గాఘాట్ వద్ద కృష్ణానది జలాన్ని విజయవాడ విశ్వహిందూ పరిషత్తు, భజరంగ్‌దళ్ విజయవాడ విభాగం ఆధ్వర్యంలో సేకరించారు.
విజయవాడ కృష్ణా నది నుంచి జలం, దుర్గమ్మ సన్నిధి నుంచి మృత్తకలు సేకరణ