ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MURDER MYSTERY: భూత వైద్యుడినంటూ లోబరుచుకుని.. పెళ్లికి పట్టుబట్టిందని హతమార్చి - క్రైమ్ వార్తలు

భూతవైద్యుడి పేరుతో ఇంటికొచ్చాడు..! మాయమాటలతో యువతిని లోబర్చుకున్నాడు..! ముందు ప్రేమించానన్నాడు...! తర్వాత పెళ్లి ఊసులతో నమ్మించాడు..! రాష్ట్రాల సరిహద్దులు దాటి... చెంతకు రప్పించుకున్నాడు..! చివరికి ఆమె నగలు కాజేసి హత్య చేశాడు..! కలకలం రేపిన విజయవాడ యువతి ఫాతిమా హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు.

MURDER MYSTERY
MURDER MYSTERY

By

Published : Aug 11, 2021, 5:05 AM IST

భూత వైద్యుడినంటూ లోబరుచుకుని.. పెళ్లికి పట్టుబట్టిందని హతమార్చి

విజయవాడలో కలకలం రేపిన తస్లీం ఫాతిమా అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. చిట్టినగర్‌లో ఉంటున్న నజీర్ అహ్మద్ కుమార్తె ఫాతిమా... మానసిక సమస్యలతో బాధ పడుతుండేది. తెలిసినవారు చెప్పడంతో.. కుమార్తెకు మానసిక ఇబ్బందుల్ని తొలగించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భూతవైద్యుడు మహ్మద్ వాసీఫ్‌ను పిలిపించాడు. వాసిఫ్ తన స్నేహితుడితో కలిసి వచ్చాడు. వారం రోజులు విజయవాడలోనే ఉండి.. ప్రేమ పేరుతో ఫాతిమాను లోబర్చుకున్నాడు. అనంతరం ఉత్తర్​ప్రదేశ్​ వెళ్లిపోయాడు. ఫాతిమాతో ఫోన్‌లో మాట్లాడుతూనే, ఉత్తర్​ప్రదేశ్ వస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

భార్యతో గొడవలొస్తున్నాయని ..

గత నెల 9న ఫాతిమా దిల్లీ వెళ్లేందుకు రైలు టికెట‌్, విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు ప్రయాణించడానికి వాహనాన్నీ వాసిఫ్ ఏర్పాటు చేశాడు. దిల్లీలో చేరుకున్న ఫాతిమాను స్నేహితుడు తయ్యబ్‌తో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని షెహరాన్‌పూర్‌ తీసుకెళ్లిన వాసీఫ్‌.. 5 రోజులు ఒక ఇంట్లో ఉంచాడు. ఈ విషయం తెలిసిన భార్య.. వాసీఫ్‌ను నిలదీసింది. అదే సమయంలో ఇంటి యజమానికీ అనుమానం రావటంతో.. ఫాతిమాను మరో చోటుకి మార్చాడు. రోజులు గడిచేకొద్దీ పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్న ఫాతిమాను అంతం చేసేందుకు ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా షెహరాన్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్నీకుండ్ జలాశయానికి ఆమెను తీసుకెళ్లాడు. గతనెల 18న ఆ ప్రాంతానికి తీసుకెళ్లి.. స్నాక్స్, కూల్‌డ్రింక్ ఇప్పించాడు. స్నాక్స్‌ తింటూ, కూల్‌డ్రింక్‌ తాగుతూ ఉన్న ఫాతిమాను.. అదును చూసి గట్టుపై నుంచి జలాశయంలోకి తోసేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయాడు.

సెల్​ఫోన్​ సిగ్నల్స్​ ఆధారంగా..

కుమార్తె కనిపించడం లేదన్న ఫాతిమా తండ్రి అహ్మద్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజయవాడ పోలీసులు.. హత్నీకుండ్ జలాశయం దగ్గర చివరి ఫోన్ సిగ్నల్ ఉన్నట్లు గుర్తించారు. దాని ఆధారంగా ఆ ప్రాంతంలో వెదకగా.. ఘటన జరిగిన 4 కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభించింది. ఫాతిమా చావుకు కారణమైన వాసిఫ్, అతనికి సహకరించిన తయ్యబ్‌ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. నిందితులకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించగా.. మచిలీపట్నం జైలుకు తరలించారు. నిందితుల నుంచి పోలీసులు బంగారం, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

PRIVATE SCHOOLS: గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేతపై నేడు విచారణ

ABOUT THE AUTHOR

...view details