రాష్ట్రంలో పేదలకు తక్షణమే నిర్మించిన ఇళ్లను ఇవ్వాలంటూ విజయవాడ సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. ఈ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడికి లబ్ధిదారులు తరలి రావాలి పిలుపునిచ్చారు. లబ్ధిదారులు అప్పులు చేసి డబ్బులు కట్టినా... పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను ఎందకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తక్షణమే మంత్రి ఆదేశాలను అమలు చేసి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
'అర్హులైన వారికి తక్షణమే నిర్మించిన ఇళ్లను ఇవ్వండి' - విజయవాడ సీపీఐ తాజా వార్తలు
రాష్ట్రంలోని పేదలకు తక్షణమే నిర్మించిన ఇళ్లను ఇవ్వాలని విజయవాడ సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఇళ్లను ఇవ్వాలంటూ మంత్రి బొత్స ఆదేశించి 10 రోజులు గడిచినా ఎందుకు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.
విజయవాడ సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్