ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారత్​కు వచ్చే విదేశీయులకు ఏర్పాట్లపై సీపీ సమీక్ష - vijayawada cp airport chcking news in telugu

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఏర్పాట్లపై విజయవాడ సీపీ​ ద్వారకా తిరుమలరావు విమానాశ్రయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు.

అధికారులతో చర్చిస్తున్న విజయవాడ సీపీ ద్వారక తిరుమల రావు
అధికారులతో చర్చిస్తున్న విజయవాడ సీపీ ద్వారక తిరుమల రావు

By

Published : May 10, 2020, 10:55 PM IST

దుబాయ్... కువైట్ వంటి దేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం రానుంది. ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఏర్పాట్లపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్​ ద్వారకా తిరుమలరావు విమానాశ్రయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. సుమారు 150 మంది వచ్చే అవకాశం ఉండటంతో వారికి పెయిడ్ క్వారంటైన్, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​లకు తరలించడానికి కావల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రత్యేక విమానంలో వచ్చిన వారందరికి థర్మో స్క్రీనింగ్​ పరీక్షలు చేసిన అనంతరం క్వారంటైన్​లకు తరలిస్తామని సీపీ వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details