ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆ ఆదేశాలివ్వడం విడ్డూరాలకే విడ్డూరం'

By

Published : Nov 15, 2020, 4:41 PM IST

స్వరూనందేంద్రస్వామిపై ప్రభుత్వం శ్రుతిమించిన స్వామిభక్తి చూపుతోందని వేమూరి ఆనందసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా జరిగే చర్యలపై రమణ దీక్షితులు ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.

'ఆ ఆదేశాలివ్వడం విడ్డూరాలకే విడ్డూరం'
'ఆ ఆదేశాలివ్వడం విడ్డూరాలకే విడ్డూరం'

స్వరూపానంద జన్మదిన వేడుకలను 23 ప్రధాన ఆలయాల్లో నిర్వహించాలని ఆదేశాలివ్వటం విడ్డూరాలకే విడ్డూరమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య ఎద్దేవా చేశారు. దీని వెనుక వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిల ప్రమేయం ఉందని ఆరోపించారు. అన్ని ఆలయాల్లో పీఠాధిపతులు, స్వామీజీలను గౌరవంగానే చూస్తారని.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి మరీ సత్కరించాలని చెప్పడం ఆగమశాస్త్రాలకే విరుద్ధమన్నారు. గతంలో అనేక అంశాలపై గగ్గోలు పెట్టిన రమణదీక్షితులు, జగన్ ప్రభుత్వంలో హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా జరిగే చర్యలపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆనందసూర్య నిలదీశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details