తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై శాసనసభలో చేసిన వ్యాఖ్యలను వైకాపా ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన చట్టసభల్లో వ్యక్తిగత దూషణలు ఏంటని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ సభలో చేసిన విమర్శలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి : వర్ల రామయ్య
చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై శాసనసభలో చేసిన వ్యాఖ్యలను వైకాపా ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 'నారా దంపతులకు వర్ల దంపతుల మద్దతు' నినాదంతో చేపట్టిన నిరసన దీక్షను విరమించారు.
వర్ల దంపతుల 12 గంటల నిరసన దీక్ష
విజయవాడలోని తన స్వగృహంలో 'నారా దంపతులకు వర్ల దంపతుల మద్దతు' అనే నినాదంతో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టారు. తెదెేపా నేతలు దేవినేని, పట్టాభి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
ఇదీ చదవండి:తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితపై కేసు నమోదు
Last Updated : Nov 25, 2021, 8:33 PM IST