ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోనసీమను చూస్తుంటే.. పాకిస్థాన్ గుర్తుకొస్తోంది: వంగలపూడి అనిత

Vangalapudi Anitha on Amalapuram incident: ముఖ్యమంత్రి జగన్​ అరాచకాలకు అమలాపురం ఘటనే నిదర్శనమని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. కోనసీమను చూస్తుంటే పాకిస్థాన్ గుర్తుకొస్తోందన్న ఆమె.. అత్యాచారాలను తేలిగ్గా తీసుకునేవారు ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడతారా..? అని ప్రశ్నించారు.

వంగలపూడి అనిత
Vangalapudi Anitha on Amalapuram incident

By

Published : Jun 2, 2022, 8:38 PM IST

Vangalapudi Anitha on CM Jagan: రాష్ట్రం ఏమైపోయినా, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా.. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడంలేదని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. కోనసీమను చూస్తుంటే పాకిస్థాన్ గుర్తుకొస్తోందన్నారు. జగన్​ అరాచకానికి కోనసీమ ప్రాంతం మచ్చుతునక అని అన్నారు. అధికార దాహంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైళ్లు తగలబెట్టించారని మండిపడ్డారు. ఇవాళ సొంతపార్టీ ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి మంత్రి ఇంటిని తగలబెట్టిన వారు.. రేపు అధికారం కోసం ప్రజల్ని తగలబెట్టరా ? అని దుయ్యబట్టారు. అత్యాచారాలను తేలిగ్గా తీసుకునేవారు.. ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడతారా..? అని ప్రశ్నించారు.

అమలాపురం ఘటనలో 65మందిని పోలీసులు అరెస్టు చేస్తే.. అందులో 45మంది వైకాపాకు చెందిన వారే ఉన్నారని పేర్కొన్నారు. ఆత్మకూరులో దమ్ముంటే పోటీచేయండి అనేవారికి దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ప్రత్యేకహోదా కోసం వైకాపా ఎంపీలతో రాజీనామాలు చేయించండి.. ప్రజల్లోకి వెళ్లి ఎవరి బలం ఎంతుందో తేల్చుకుందాం అని వంగలపూడి అనిత అన్నారు.

ఇదీచదవండి:

ABOUT THE AUTHOR

...view details