ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుపై పునఃపరిశీలన చేయాలి' - అంబేడ్కర్‌ విగ్రహా ఏర్పాటుపై పునఃపరిశీలన చేయాలి

విజయవాడ స్వరాజ్‌ మైదానంలో భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాం ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. అమరావతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

'అంబేడ్కర్‌ విగ్రహా ఏర్పాటుపై పునఃపరిశీలన చేయాలి'
'అంబేడ్కర్‌ విగ్రహా ఏర్పాటుపై పునఃపరిశీలన చేయాలి'

By

Published : Jul 7, 2020, 8:01 PM IST

అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేసిందని గుర్తుచేశారు. ఇంతవరకు అక్కడ పనులు ముందుకు వెళ్లనందున... వాటిని చేపట్టి విగ్రహం పూర్తి చేసిన ఖ్యాతిని ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటే మంచిదని హితవుపలికారు. విజయవాడలో ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక పెద్ద గ్రౌండ్ స్వరాజ్‌ మైదానంలో విగ్రహం ఏర్పాటు ద్వారా.. ఇప్పటివరకు భారీ ప్రదర్శనలు ఇతర కార్యక్రమాలకు వేదికగా ఉన్న ఈ ప్రాంతం ఆ అవకాశాన్ని కోల్పోతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details