అగ్నిమాపక శాఖలో ఖాళీలు త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర హోంమంత్రి సుచరిత తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలోని అగ్నిమాపక కేంద్ర నూతన భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 155 అగ్నిమాపక కేంద్రాలున్నాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని ప్రాంతాలకు చేరుకోవాలంటే చాలా సమయం పడుతుందన్నారు. అటువంటి ప్రాంతాలను గుర్తించి నూతన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు తగ్గినా.. పారిశ్రామిక వాడల్లో పెరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా... ఎప్పుడూ సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని అగ్నిమాపక సిబ్బందికి సూచించారు.
అగ్నిమాపక శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం: హోంమంత్రి - fire department
అగ్నిమాపక శాఖలో ఖాళీలు త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర హోంమంత్రి సుచరిత తెలిపారు. అవసరమైన ప్రదేశాలను గుర్తించి కొత్త కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పారు.
హోంమంత్రి సుచరిత