ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు రాష్ట్ర పర్యటనకు రానున్న.. కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్ - రాష్ట్ర పర్యటనకు రానున్న కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్

కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్.. రేపు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఎల్లుండి సీఎం జగన్​తో కలిసి ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.

రేపు రాష్ట్ర పర్యటనకు రానున్న కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్
రేపు రాష్ట్ర పర్యటనకు రానున్న కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్

By

Published : Mar 2, 2022, 10:37 PM IST

కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రేపు (గురువారం) రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రేపు రాత్రి 7.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి కేంద్రమంత్రి చేరుకుంటారు. ఆ తర్వాత సీఎం జగన్ ఆయనకు విందు ఇవ్వనున్నారు.

శుక్రవారం సీఎం జగన్​తో కలిసి కేంద్ర మంత్రి షెకావత్.. పోలవరం ప్రాజెక్టు, నిర్వాసిత కాలనీలను సందర్శించనున్నారు. అనంతరం పీపీఏ, జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details