ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే ఆధ్వర్యంలో 500 ఆలయాలు నిర్మిస్తాం : ఛైర్మన్ సుబ్బారెడ్డి

గాయత్రీ సొసైటీ ఇచ్చిన కపిలగోవును.. విజయవాడలోని కాశీ విశ్వేశ్వర ఆలయానికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. నిర్వాహకులు ముందుకు వస్తే.. గుడికో గోమాత కార్యక్రమం కింద పలు ఆలయాలకు ఆవు, దూడలను చేరవేస్తామన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో 500 ఆలయాలు నిర్మించేందుకు సీఎం జగన్ సంకల్పించినట్లు తెలిపారు.

ttd chairman in gudiko gomata at vijayawada
విజయవాడలో గుడికో గోమాత కార్యక్రమంలో పాల్గొన్న తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి

By

Published : Feb 4, 2021, 4:51 PM IST

తితిదే చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని.. వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గోవులను దానమిచ్చేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారని తెలిపారు. గాయత్రీ సొసైటీ అందజేసిన కపిల గోవును.. విజయవాడలోని కాశీ విశ్వేశ్వరాలయానికి తితిదే ఛైర్మన్ అప్పగించారు. అనంతరం గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లితో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ఖర్చుతోనే చేరుస్తాం:

గోవును పూజిస్తే ముక్కోటి దేవతలు, తల్లిదండ్రులను పూజించినట్టేనని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆవు విశిష్టతను తెలియచేసేందుకు 'గుడికో గోమాత' చేపట్టామన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని వివరించారు. ఆలయాల నిర్వాహకులు ముందుకొస్తే స్వంత ఖర్చులతోనే ఆవు, దూడను తితిదే చేరుస్తుందన్నారు.

త్వరలో కల్యాణమస్తు...

హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తితిదే ఛైర్మన్ పేర్కొన్నారు. కల్యాణమస్తు ద్వారా ఆర్థిక స్థోమత లేని పేద జంటలకు తాళిబొట్టు, బట్టలు అందచేసి.. వివాహాలు జరిపించే కార్యక్రమం త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని అందరికీ చేరువ చేసేందుకు.. తితిదే ఆధ్వర్యంలో 500 ఆలయాలను నిర్మించాలని సీఎం జగన్ సంకల్పించినట్లు తెలిపారు. త్వరలోనే వాటి నిర్మాణం ప్రారభమవుతుందన్నారు.

ఇదీ చదవండి:

లైవ్ వీడియో: లబ్ధిదారుడి చెంప ఛెళ్లుమనిపించిన రేషన్ డీలర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details