prakasam barrage:ప్రకాశం బ్యారేజీపై వాహన రాకపోకలు నిలిపివేత - విజయవాడ ముఖ్య వార్తలు
08:45 October 12
prakasam barrage taza
ప్రకాశం బ్యారేజీపై వాహన రాకపోకలను అధికారులను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే నిన్న రాత్రి 11 గంటలకు నిలిపివేస్తామని చెప్పి...10 గంటలకే రాకపోకలు నిలిపివేశారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. బ్యారేజి వద్ద బారికేడ్లు పెట్టడంతో వాహనదారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తాడేపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేయటంతో ప్రకాశం బ్యారేజీపై అరకిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలకు మాత్రం అనుమతిస్తున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:chandrababu:పేదలకు ఇళ్ల స్థలాలపై పిటిషన్ వేసింది వైకాపా నేతలే