విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసుల వాహనదారులకు సూచించారు. స్వల్ప ఉద్రిక్తత జరిగింది. కంచికర్ల-దొనకొండ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను పోలీసులు నిలిపివేశారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ వరకు అనేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటయ్యాయని... వెళ్లటం కుదరదని వాహనదారులకు పోలీసులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తాము వెళ్లాలని వాహనదారులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కొన్ని వాహనాలను పంపారు.
విజయవాడ-హైదరాబాద్ హైవేపై స్వల్ప ఉద్రిక్తత - విజయవాడ జాతీయ రహదారి
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో లాక్‌డౌన్ చేయాలని నిర్ణయించగా అంతర్రాష్ట్ర సరిహద్దులను అధికారులు మూసివేశారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని మూసివేయగా 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు.
highway