- అన్లాక్-4 మార్గదర్శకాలు..
లాక్డౌన్ ఎత్తివేతలో భాగంగా అన్లాక్- 4 మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు సెప్టెంబర్ 7 నుంచి మెట్రోరైళ్లను పునరుద్ధరించేందుకు అవకాశం కల్పించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కొత్తగా 10,548 కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా కట్టడి కావడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 10,548 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,096 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. కరోనాతో మరో 82 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 36.03 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- మొక్కజొన్న రైతుల అవస్థలు
కరోనా.. మొక్కజొన్న రైతుల పాలిట శాపంగా మారింది. పంటను కొనేవారు లేక పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొక్కజొన్న సాగుచేసిన కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- బయటపడిన యుద్ధ బంకర్లు
విశాఖపట్నం తీరంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాంక్రీట్ బంకర్లు బయటపడ్డాయి. ఇవి రెండో ప్రపంచ యుద్ధం నాటివని సమాచారం. అరుదైన బంకర్లను చూసేందుకు నగర వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- సరిహద్దుల్లో సొరంగం
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో ఓ సొరంగాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. జమ్ములోని సరిహద్దు కంచెకు దగర్లో సొరంగం ఉన్నట్లు తెలిపింది. భారత్ వైపు 50 మీటర్లు వరకు ఉన్న ఈ సొరంగ మార్గం 25 మీటర్ల లోతు ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- భాజపా 'కమల్ కనెక్ట్'
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సర్వం సిద్ధం చేస్తోంది. కరోనా మహమ్మారి, వరదల బీభత్సం నేపథ్యంలో డిజిటల్ వేదికగా ప్రజలను చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- దేశాలు అతలాకుతలం
అంతర్జాతీయంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. మొత్తం కేసుల సంఖ్య రెండున్నర కోట్లకు చేరువలో ఉంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఆయన మరణమే కారణం!
ఐపీఎల్ నుంచి అర్థంతరంగా రైనా తప్పుకోవడానికి కారణం, ఆయన బంధువు ఒకరు దుండగుల దాడిలో చనిపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ విషయమై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- నెమ్మదిగా కోలుకుంటున్న ఎస్పీ బాలు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..