- బస్సు ప్రమాదంపై నేతల తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
CONDOLENCES ON BUS ACCIDENT: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Amaravati Farmers Meeting: తిరుపతిలో అమరావతి రైతుల సభకు హైకోర్టు అనుమతి
Amaravati Farmers Meeting: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతుల తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకోవాలని రైతులకు సూచించింది. రాయలసీమ ఐక్య వేదిక సభను.. మరుసటిరోజు 18న నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Ramoji Foundation : రామోజీ ఫౌండేషన్ మరో ముందడుగు...పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం..
Ramoji Foundation: సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లిలో పంచాయతీ కార్యాలయ భవనాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి ప్రారంభించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు, ముగ్గురు మృతి
AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్.. 60కి చేరిన బాధితుల సంఖ్య
Omcron Case In Bengal: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా బంగాల్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 60కి చేరింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యూపీలో 'సరిలేరు నీకెవ్వరు' సీన్.. జవాన్లే పెళ్లి పెద్దలు