రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 27,861 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 81 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,86,066కు చేరింది. గడిచిన 24 గంటల్లో వైరస్ బారినపడి విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,141గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 263 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. వీరితో కలిపి మొత్తం 8.77 లక్షల మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,713 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 81 కరోనా కేసులు... ఒకరు మృతి
రాష్ట్రంలో కొత్తగా 81 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో ఒకరు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 81 కరోనా కేసులు