మైనార్టీలకు వైకాపా ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. సీఏఏ అమలులో కేంద్ర ప్రభుత్వం చెప్పింది వేరు, చేసేది వేరని అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అఖిలపక్షం భేటీలోనూ ఈ అంశంపై కేంద్రానికి స్పష్టతనిచ్చామన్నారు. సీఏఏపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వమని అన్నారు. ఎన్ఆరీసీని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఎన్పీఆర్పై ప్రజల్లో ఆందోళన ఉందని 2010, 2015 లకు భిన్నంగా 13ఏ, 13బి కాలమ్‌లను తీసుకువచ్చారని దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామన్నారు.
'సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు తమ ప్రభుత్వం వ్యతిరేకం'
వైకాపా మైనార్టీల పక్షపాతిగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు తమ పార్టీ వ్యతిరేకమని తెలిపారు.
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా