అజిత్‌సింగ్‌నగర్ చోరీ...ఇంటి తాళాలు పగలగొట్టి.. - క్రైమ్ వార్తలు
20:30 October 04
THEFT IN VIJAYAWADA
విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని లూనా సెంటర్లో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని ఊరు వెళ్లిన సమయంలో తాళాలను పగలగొట్టి ఇంట్లో ఉన్న 235 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 65 వేలు నగదును దొంగలు దోచుకెళ్లారు. ఇంటి ముందు తలుపు తెరిచి ఉండటం గమనించిన స్ధానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
APCC: కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది: శైలజానాథ్