ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"శ్రీలంకకు వెళ్లే పర్యాటకులకు భారీగా రాయితీలు"

ఉగ్రదాడితో తీవ్రంగా నష్టపోయిన శ్రీలంకకు పూర్వ వైభవనాన్ని తెచ్చేందుకు ఆ దేశ అధికారులు ప్రయత్నిస్తున్నారు. తమ దేశానికి వచ్చే భారతీయులకు ఆగస్ట్‌ 1 నుంచి ఉచితంగా ఆగమానంతర వీసా సదుపాయం కల్పిస్తున్నామని ఆ దేశ ప్రతినిధులు తెలిపారు.

పర్యటకులకు స్వర్గధామం... మా సింహాళం

By

Published : Jul 28, 2019, 5:29 AM IST

శ్రీలంకకు ఉచిత ఆగమానంతర వీసా సదుపాయం ఆగస్ట్‌ నుంచి అందుబాటులోకి రానుంది.శ్రీలంకలో పర్యాటకాన్ని ప్రోత్సహించటంతో పాటు భారతీయులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు తెలిపారు. కొలంబోకు చెందిన బెలాజియో ఎంటర్ టైన్ మెంట్, శ్రీలంకన్ ఎయిర్ లైన్స్, కింగ్స్ బరీ హోటల్స్ సంయుక్తంగా విజయవాడలోని యి. నోవోటెల్ హోటల్ లో పరిచయ కార్యక్రమం నిర్వహించాయి. శ్రీలంకలో ఉన్న ప్రముఖ సందర్శనీయ ప్రదేశాలు, క్యాసినో లాంటి గేమింగ్ జోన్ ల గురించి నగర వాసులకు తెలియజేశారు. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందించేలా... విమానయాన, హోటల్ సంస్థలు పలు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు

శ్రీలంకకు వెళ్లే పర్యాటకులకు భారీగా రాయితీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details