ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అందుకే బీసీలంటే జగన్​కు కోపం : చంద్రబాబు

భవన నిర్మాణ కార్మికుల్లో 80 నుంచి 90శాతం మంది వెనుకబడిన వర్గాలే ఉన్నందున వారిని దెబ్బతీసేందుకే కృత్రిమ ఇసుక కొరత సృష్టించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. తెలుగుదేశానికి అండదండగా ఉండే బీసీలంటే ముఖ్యమంత్రి జగన్‌కు కోపమని...అందుకే ఈలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

By

Published : Nov 15, 2019, 6:05 AM IST

Updated : Nov 15, 2019, 7:17 AM IST

చంద్రబాబు

భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు ఉపాధి దొరికే వరకు వారికి నెలకు 10వేల రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 35 లక్షల కుటుంబాల కోసం తాము దీక్ష చేస్తుంటే పార్టీలోని ఇద్దరు నేతలను చేర్చుకుని తనపై విమర్శలకు ప్రేరేపించారని మండిపడ్డారు.

రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యం తెలుగుకే ఉండి తీరాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండానే ఆంగ్ల మాధ్యమాన్ని ఎలా ప్రవేశపెడతారని నిలదీశారు.

కులం పేరుతో సమాజాన్ని విడదీయాలని... జగన్ కుట్రపన్నుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బంగారు గుడ్డుపెట్టే బాతులాంటి రాజధానిని అప్పగిస్తే సింగపూర్‌ సంస్థలు వెనక్కి వెళ్లిపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యవహార శైలి వల్ల రాష్ట్రంలో యువతకు భవిష్యత్తులో ఉపాధి దొరకదన్నారు. పెట్టుబడులు అన్నీ ఏపీ వదిలి వెళ్లిపోతున్నాయన్నారు.

పేదలకు అన్నం పెట్టే అన్నా కాంటీన్లు ఏం చేశాయని ప్రశ్నించిన చంద్రబాబు...రంగులు మార్చి మరీ మూసివేయడాన్ని తప్పుబట్టారు. దీక్షకు సంఘీభావంగా హాజరైన విపక్ష నేతలతో పాటు అన్ని వర్గాల వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు

ఇదీచదవండి

మసీదులో ప్రార్థన వినగానే... చంద్రబాబు ఏం చేశారో తెలుసా..?

Last Updated : Nov 15, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details