ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KCR Yadadri Tour Cancelled: తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు - yadadri temple

KCR Yadadri Visit Cancelled : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. సీఎం పర్యటన రద్దుతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. యాదాద్రికి వెళ్లనున్నారు.

CM KCR's Yadadri visit is cancelled
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు

By

Published : Mar 11, 2022, 10:58 AM IST

KCR Yadadri Tour Cancelled : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవానికి కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. సీఎం పర్యటన రద్దుతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. యాదాద్రి వెళ్లనున్నారు.

యాదాద్రీశుడి కల్యాణ మహోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కేసీఆర్ పర్యటన రద్దుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుకల్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. తితిదే అధికారులు యాదాద్రి ఈఓ గీతారెడ్డికి పట్టువస్త్రాలు అందించారు.

మార్చి 28న ప్రధానాలయం పునఃప్రారంభ నేపథ్యంలో కొనసాగుతున్న పనులు, మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై అధికారులతో సీఎం సమీక్ష యథావిధిగా జరగనున్నట్లు సమాచారం. యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై సీఎం కేసీఆర్ ఆరా తీయనున్నారు.

ఇదీ చదవండి :

TDP on Jagan: 'ఆ ఫలితాలతో.. జగన్​ రెడ్డికి మరింత భయం'

ABOUT THE AUTHOR

...view details