ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జరుగుతున్న హత్యలు, దాడి లెక్కలు రాసి పెట్టుకున్నాం: యరపతినేని

Yarapathineni News: పేదల కడుపునింపే పార్టీ తెలుగుదేశం అయితే.. పేదల పొట్టగొట్టే పార్టీ వైకాపా అని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే.. సింహం వేట ఎలా ఉంటదో వైకాపా నేతలు రుచిచూడాల్సి ఉంటుందని యరపతినేని హెచ్చరించారు. పల్నాడులో జరిగిన ప్రతీ హత్య, దాడి లెక్కలు రాసి పెట్టుకున్నామని.. తగిన సమాధానం చెబుతామని యరపతినేని తేల్చిచెప్పారు.

Yarapathineni Srinivasa Rao
Yarapathineni Srinivasa Rao

By

Published : Jun 24, 2022, 4:14 PM IST

Updated : Jun 24, 2022, 4:29 PM IST

పల్నాడులో జరిగిన హత్య, దాడి లెక్కలు రాసి పెట్టుకున్నాం: యరపతినేని

Yarapathineni Srinivasa Rao on YSRCP: అధినేత చంద్రబాబు మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే.. సింహం వేట ఎలా ఉంటదో వైకాపా నేతలు రుచిచూడాల్సి ఉంటుందని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రానికి జగన్ తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమేనని విమర్శించారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చిన సింహాలు ఎన్టీఆర్, చంద్రబాబుల వారసత్వాన్ని నారా లోకేశ్​ అందిపుచ్చుకుంటే.. రాయలసీమలో కులాల కుంపటి పెట్టి ఫ్యాక్షన్​కు అడ్డాగా మార్చిన రాజారెడ్డి, వైఎస్​ల వారసత్వం జగన్ రెడ్డిది అని యరపతినేని ధ్వజమెత్తారు. రాజకీయంగా రాయలసీమను అప్రతిష్టపాలు చేసిన గ్రామ సింహాలు జగన్ కుటుంబ సభ్యులే అని దుయ్యబట్టారు. పల్నాడులో జరిగిన ప్రతీ హత్య, దాడి లెక్కలు రాసి పెట్టుకున్నామని.. త్వరలో తగిన సమాధానం చెబుతామని యరపతినేని తేల్చిచెప్పారు. పల్నాడులో కుప్పకూలుతున్న సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే వరుస హత్యలు, ఊచకోతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, వైకాపా ప్రభుత్వం పతనావస్థకు చేరాయని మండిపడ్డారు. సొంత బాబాయి​ని చంపిన ఏ1 ముద్దాయి ఎవరంటూ పిన్నెల్లి మతిభ్రమించి మాట్లాడుతున్న తీరును ఆపార్టీ నేతలే గ్రహించుకోవాలన్నారు. అక్రమ మద్యం, విగ్రహాల దొంగతనంతోపాటు ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన కేసులు పిన్నెల్లి ఉన్నాయని గుర్తు చేశారు. 10వ తరగతి ప్రశ్నపత్రాలు దొంగిలించిన బయోడేటా జగన్​ది అయితే.. కార్యకర్తల సంక్షేమం కోసం తపిస్తూ, పేదలకు అన్నంపెట్టి ఆకలి తీర్చే బయోడేటా లోకేశ్​ది అని యరపతినేని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 24, 2022, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details