కేంద్రం అవకాశమిచ్చినప్పుడు ఆర్డర్ పెట్టకుండా... ఇప్పుడు ఇతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తే వ్యాక్సిన్ వస్తుందా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నిలదీశారు. అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు లేఖల రాజకీయానికి తెరలేపారని ఆక్షేపించారు. గ్లోబల్ టెండర్ల పేరుతో సమయం వృథా చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
లేఖలు రాస్తే వ్యాక్సిన్ వస్తుందా ముఖ్యమంత్రి గారూ!: అచ్చెన్నాయుడు
వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అవకాశం ఇచ్చినప్పుడు ఆర్డర్ పెట్టకుండా... ఇప్పుడు ఇతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయడం హాస్యాస్పదమని అన్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే లేఖలతో రాజకీయం చేస్తున్నారని అచ్చెన్న ఆక్షేపించారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
టీకా అందుబాటులో ఉన్నప్పుడు కేవలం రూ.45కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా 16లక్షల మంది కరోనా బారిన పడి, 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులో చూపిన శ్రద్ధ కరోనా నియంత్రణపై పెట్టి ఉంటే రాష్ట్రంలో కరోనా అదుపులో ఉండేదని అచ్చెన్నాయుడు అన్నారు.
ఇదీచదవండి.