ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా ప్రతిపాదనకు అంగీకారం: శ్రీకాంత్ రెడ్డి

రాష్ట్రంలో కరువుపై చర్చించాలనే తెదేపా ప్రతిపాదనను అంగీకరిస్తున్నామని ప్రభుత్వ చీఫ్​విప్ జి.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. విపక్షాలకు పూర్తి అవకాశం కల్పించిన బీఏసీలో, అసెంబ్లీలో చర్చించే అంశాలను తెదేపా ప్రస్తావించకపోవడం ఆశ్యర్యం కలిగించిందని చెప్పారు.

బీఏసీలో తెదేపాకి దక్కే స్థానం 0.5 శాతం

By

Published : Jul 10, 2019, 4:16 PM IST

అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను ప్రతిపక్షం బీఏసీలో చర్చించకపోవటం ఆశ్చర్యం కలిగించిందని ప్రభుత్వ చీఫ్​విప్ జి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు.గతంలో తాను బీఏసీ సభ్యుడిగా పని చేసినప్పుడు ప్రతిపక్షం కనీసం మాట్లాడే అవకాశం కల్పించలేదని తెలిపారు. రాష్ట్రంలో కరువుపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన దానికి అంగీకారాన్ని తెలిపామన్నారు. మీడియా ముందు అబద్దపు ప్రచారం చేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందన్నారు. ప్రతిపక్షానికి ఉన్న సంఖ్యాబలం ప్రకారం బీఏసీలో తెదేపాకి దక్కే స్థానం 0.5 శాతమని శ్రీకాంత్ రెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details