ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

kanakamedala : ఉక్రెయిన్​ నుంచి విద్యార్థుల తరలింపును రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది: కనకమేడల - latest news in vijayawada

kanakamedala: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను సాధ్యమైనంత త్వరగా ఇండియాకు రప్పించాలని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శిని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కలిశారు.

kanakamedala comments
కనకమేడల రవీంద్రకుమార్

By

Published : Mar 2, 2022, 2:54 PM IST

Updated : Mar 2, 2022, 6:10 PM IST

కనకమేడల రవీంద్రకుమార్

kanakamedala comments: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను సాధ్యమైనంత త్వరగా ఇండియాకు రప్పించాలని కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ కోరింది. కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శిని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కలిసి తెలుగు విద్యార్థుల వివరాలను అందజేశారు. తెదేపా హెల్ప్‌ లైన్‌ ద్వారా సేకరించిన వివరాలు అందజేశారు. తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. తెలుగు విద్యార్థుల తరలింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని కనకమేడల విమర్శించారు.

తెదేపా హెల్ప్‌ లైన్‌ ద్వారా ఉక్రెయిన్​లో ఉన్న సుమారు 1500 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థుల వివరాలు సేకరించాము. వారికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శికి అందజేశాను. ఉక్రెయిన్​లో ఉన్న విద్యార్థుల గురించి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోకపోవడం దురదృష్టకరం. - కనకమేడల రవీంద్రకుమార్​, తెదేపా ఎంపీ

ఇదీ చదవండి: Jagannadhastakam CD: ‘జగన్నాథాష్టకం’ సీడీని విడుదల చేసిన ఉపరాష్ట్రపతి

Last Updated : Mar 2, 2022, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details