ఏపీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు ఫరూఖ్ షిబ్లీ, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్‌లు రాజ్ భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు, పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య, హాజిరాపై అత్యాచారం, దాచేపల్లిలో అలీషా, కడపలో అక్బర్ బాషా ఘటనలను గవర్నర్‌కు వివరించారు.
Complaint: 'ధైర్యం చెప్పడానికి వెళ్తే నోరు నొక్కేస్తారా ?'..గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు - tdp latest news
రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్(Governor Bishwabhushan Harichandan)ను తెదేపా నేతలు(tdp leaders) కలిశారు.రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు, పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని వర్ల ఆరోపించారు. మంత్రి వర్గం ఏవిధంగా అరాచకాలు పాల్పడుతుందో..అధికారవర్గాలు అవే అరాచకాలు చేస్తున్నాయని వర్ల విమర్శించారు.

మైనార్టీల హక్కుల పరిరక్షణ, ఘటనలపై విచారణ నిర్వహించాలని షిబ్లీ కోరారు. చట్టప్రకారం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడం లేదని, రాష్ట్రంలో రూల్ అఫ్ లా లేదని వర్ల ఆరోపించారు. మంత్రి వర్గం ఏవిధంగా అరాచకాలకు పాల్పడుతున్నారో అధికార వర్గాలు కూడా అవే అరాచకాలు చేస్తున్నాయని వర్ల ఆరోపించారు. అక్బర్ భాషా ఘటనలో ధైర్యం చెప్పడానికి వెళ్లిన షిబ్లీపై అక్రమ కేసు పెట్టడం అన్యాయమని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ మండిపడ్డారు. మైనార్టీ సంస్థ ధైర్యం చెప్పడానికి వెళ్తేనే నోరు నొక్కేస్తారా ? అని నిలదీశారు. తప్పుడు కేసులు పెట్టి మైనార్టీలను వేధించే చర్యలను ఆపాలన్నారు. ప్రభుత్వం తన తప్పును తెలుసుకొని కేసును వెనక్కి తీసుకోవాలని షరీఫ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి