గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లిపాయల కొరత ఉందని తెదేపా నేతలు అన్నారు. ఉల్లి ధరలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, ఎమ్మెల్సీ అశోక్బాబులు పటమట రైతుబజార్ని సందర్శించారు. కృష్ణాజిల్లాలో 25 లక్షల కుటుంబాలు ఉంటే 2 లక్షల కిలోలు మాత్రమే అందిస్తున్నారన్నారు. ఒక్కో కుటుంబానికి నెలకి 1 కేజీ మాత్రమే వస్తుందని.. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చాలనే చిత్తశుద్ధి లేకుండా.. ప్రభుత్వం నామమాత్రంగా చర్యలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. కిలో ఉల్లిపాయల కోసం ప్రజలు బారులు తీరడం గతంలో ఎన్నడూ లేదన్నారు. క్యూ లైన్లో ఉన్న వారికి 5 కేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'ఉల్లి ధరలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు' - ఉల్లి ధరలపై తెదేపా నేతలు
ఉల్లి ధరలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెదేపా నేతలు విమర్శించారు. ఉల్లిపాయల కోసం ప్రజలు ఇలా బారులు తీరడం గతంలో ఎన్నడూ లేదన్నారు.
ఉల్లి ధరలపై తెదేపా నేతల ఆగ్రహం