ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది' - ఎన్నికల నామినేషన్లలో అధికారుల తీరుపై తెదేపా నేతల మండిపాటు

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో తెదేపా అభ్యర్థులు.. నామినేషన్లు వేయటానికి వెళ్తే అధికారులు ఎవరూలేరని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ వెంటనే స్పందించాలని ఇరువురు విజ్ఞప్తి చేశారు.

tdp leaders fires on  government about election nominations process
'రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది'

By

Published : Jan 25, 2021, 3:40 PM IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు.. తెదెపా ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. కృష్ణ జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో వార్డు మెంబెర్లు, సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ పత్రాల కోసం వెళితే కింద స్థాయి అధికారులు ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదని చెప్పటం ఎలక్షన్ కమిషన్​ నిబంధనలు ఉల్లంఘనే అని ఆయన ఆరోపించారు. దీనిపై రాష్ట్రపతి, గవర్నర్ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు : ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని.. తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుండటంతో.. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకువాలన్నారు.

సీఎం జగన్ కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు అధికారులు, ఉద్యోగులు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న సీఎం.. గణతంత్ర వేడుకల్లో ఎలా పాల్గొంటారని నిలదీశారు. గవర్నర్ వెంటనే పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని కోరారు.

ఇదీ చదవండి:పిటిషన్ కొట్టి వేసిన ధర్మాసనం... యథావిధిగా స్థానిక ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details