మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై డీజీపీ ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొడాలి నాని వంటి వారిని మంత్రిగా కొనసాగించడానికి వీల్లేదన్నారు.
కృష్ణా జిల్లాలోని ఎస్సీలంతా రేపటి చలో అయినంపూడిని విజయవంతం చేయాలని వర్ల పిలుపునిచ్చారు. ఎస్సీ నేతలు అయినంపూడి చేరేలోగా దోషులను సీఎం అరెస్టు చేయించాలన్నారు.