ముఖ్యమంత్రి జగన్ను కించపరుస్తూ.. 'ది ఆర్గనైజర్ పత్రిక' రాసిన కథనంపై జగన్ సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి మౌనం వీడకపోతే.. అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అని ఆ పత్రిక చేసిన ఆరోపణలను సంపూర్ణాంగీకారణంగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. పత్రిక చేసిన ప్రతి ఆరోపణపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలంటూ.. 13 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు.
మత మార్పిడులు, అధికారం కోసం హిందూ వ్యతిరేక అజెండా, బెంగుళూరుల్లో ఖరీదైన భవనాలు, జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు, తదితర అంశాలపై వర్లరామయ్య ప్రశ్నాస్త్రాలను లేఖలో సంధించారు.