Somireddy on ttd: తిరమల శ్రీవారికి భక్తులను దూరం చేసే కుట్రతో వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వం.. గత 3ఏళ్లలో అన్యమత ప్రచారం చేసేవారికి తితిదేలో ఉద్యోగాలు కల్పించిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. వాటికన్ సిటీ కంటే తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్యే ఎక్కువని తెలిపారు. అంతటి పవిత్ర ఆలయాన్ని వ్యాపార సంస్థగా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న తిరుమలకు పార్ట్ టైం ఈవోగా వివాదాస్పదుడైన ధర్మారెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించటమేంటని నిలదీశారు.
"అన్యమత ప్రచారం చేసేవారికి.. తితిదేలో ఉద్యోగాలు" - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
Somireddy on ttd: తిరుమల శ్రీవారికి భక్తులను దూరం చేసే కుట్ర జరుగుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ఆరోపించారు. అన్యమత ప్రచారం చేసేవారికి తితిదేలో ఉద్యోగాలు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుల్ టైమ్ ఈవోను నియమించి, భక్తులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తులను ఇబ్బంది పెడితే భగవంతుడు క్షమించడని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు.
తితిదే పూర్తిస్థాయి ఈవోను సీఎంవోలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి సంకేతాలిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తక్షణమే భక్తులకు క్షమాపణలు చెప్పి పూర్తి స్థాయి ఈవోను తితిదేకు నియమించాలని డిమాండ్ చేశారు. స్వామివారికి భక్తులిచ్చిన రూ.144కోట్లు మళ్లించిన దుస్థితి ఈ ప్రభుత్వలోనే వచ్చిందని దుయ్యబట్టారు. భక్తులను ఇబ్బంది పెడితే భగవంతుడు క్షమించడనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని హెచ్చరించారు.
ఇదీ చదవండి:తిరుపతికి పోటెత్తిన భక్తులు.. ఆదివారం వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
TAGGED:
ap latest updates