ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PDS RICE SCAM: 'పౌరసరఫరాల శాఖలో రూ. 4వేల కోట్ల కుంభకోణం'

పౌరసరఫరాల శాఖలో వేల కోట్ల రూపాయల కుంభకోణం(pds rice scam) జరిగిందని.. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వైకాపా మంత్రులపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు.

tdp leader pilli manikya rao
పౌరసరఫరాల శాఖలో రూ. 4వేల కోట్ల కుంభకోణం

By

Published : Sep 4, 2021, 7:53 PM IST

పౌరసరఫరాల శాఖలో రూ. 4వేల కోట్ల కుంభకోణం(pds rice scam) జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. తన నియోజకవర్గంలో ప్రతివారం మూడు లారీల బియ్యం అక్రమంగా రవాణా అవుతోందని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారని మాణిక్యరావు గుర్తుచేశారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో కలిపి నెలకు 2100 లారీల బియ్యం అక్రమ రవాణా జరుతోందని దుయ్యబట్టారు. ప్రతీ 50కేజీల బియ్యం బస్తాలో 5కేజీలు దొంగలిస్తున్నారని.. నంబర్ ప్లేట్లులేని వాహనాల్లో అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రులు కొడాలి నాని, శ్రీరంగనాథరాజు, ద్వారంపూడి భాస్కర్ రెడ్డి.. ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని.. ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి నాని తన శాఖలో వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడుతూ.. ఈ అంశాలు పక్కదారి పట్టించేలా మీడియాతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details