ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు: నక్కా ఆనంద్​బాబు

పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్​బాబు ఆరోపించారు. ఫలితాల సమయంలో రాత్రి పూట వైకాపా చీకటిరాజ్యం మొదలవుతోందని దుయ్యబట్టారు.

tdp-leader-nakka-anandh-babu-fire-on-ycp-government-about-panchayath-elections-results
తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు

By

Published : Feb 21, 2021, 9:40 PM IST

పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో రాత్రి 8 గంటల వరకు తెదేపా మద్దతుదారులే విజయం సాధిస్తున్నారని, ఆ తర్వాత వైకాపా చీకటిరాజ్యం మొదలవుతోందని తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు ఆరోపించారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్వగ్రామమైన కందులవారిపల్లె పంచాయతీలో పార్టీ మద్దతుదారుడు 563 ఓట్లతో గెలిచాడని ఆనంద్ బాబు పేర్కొన్నారు.

చీకటిపడే కొద్దీ రౌడీమూకలు, పోలీసులు, వైకాపా కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఫలితాలు తారుమారు చేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో అప్రమత్తంగా పనిచేసిన తెలుగుదేశం కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ తెదేపా శ్రేణులు మరింత ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాయని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details