కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేందుకే వైకాపా నేతలు తెదేపాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. కరోనాను పట్టించుకోకుండా ఎన్నికలు జరిపి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు. వైకాపా నేతలు, మంత్రులు కరోనా సాయాన్ని ఎన్నికల ప్రచారంగా మలుచుకున్నారని ఆరోపించారు. నగరిలో ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకుంటే ఇతర ప్రాంతాల్లో... వైకాపా నేతలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలంతా ఇళ్లకే పరిమితమై లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నారని అన్నారు. విపత్కర సమయంలోనూ వైకాపా నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
'అసమర్థతను కప్పిపుచ్చేందుకే తెదేపాపై ఆరోపణలు'
ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేందుకే వైకాపా నేతలు తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు దుయ్యబట్టారు. కరోనా సాయాన్ని వైకాపా నేతలు, మంత్రులు ఎన్నికల ప్రచారంగా మలుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
అసమర్థతను కప్పిపుచ్చేందుకే తెదేపాపై ఆరోపణలు