ఏపీఎస్ఎఫ్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా గౌరీశంకర్ నియామకంపై సీఐడీ ఎందుకు విచారించట్లేదని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు. ఎలాంటి ప్రలోభాలకు గురిచేసి జీవో నెంబర్ 66 ద్వారా గౌరీశంకర్‌కు పదవి కట్టబెట్టారో సీఐడీ బహిర్గతం చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ఒత్తిడితోనే గౌరీశంకర్ పై చర్యలు తీసుకోవట్లేదని, సీఐడీ పక్షపాత ధోరణి ఇక్కడే బయటపడిందని ఆరోపించారు. సరైన విద్యార్హతలు లేని గౌరీశంకర్‌కు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని.. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం ఇచ్చిందని ఈ సమాచారంతోనే సమోటోగా తీసుకుని సీఐడీ విచారణ జరిపించాలన్నారు. ఏ కుట్రలో భాగంగా ఉన్నత పదవి గౌరీశంకర్‌కు కట్టబెట్టారో వివరాలు బయటకు తీయాలన్నారు.
గౌరీశంకర్ నియామకంపై సీఐడీ ఎందుకు విచారించట్లేదు: పట్టాభిరామ్
ఏపీఎస్ఎఫ్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా గౌరీశంకర్ నియామకంపై సీఐడీ ఎందుకు విచారించట్లేదని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు. ఎలాంటి ప్రలోభాలకు గురిచేసి జీవో నెంబర్ 66 ద్వారా గౌరీశంకర్‌కు పదవి కట్టబెట్టారో సీఐడీ బహిర్గతం చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు.
కొమ్మారెడ్డి పట్టాభిరామ్
తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించినందుకు గౌరీశంకర్‌పై కేసు నమోదు చేసి చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. నిరాధార ఆరోపణల్ని ముందుకు తెచ్చి ఏదోరకంగా ఫైబర్ నెట్ ప్రాజెక్టుని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఐడీ విభాగాధిపతి సునీల్ కుమార్ తాడేపల్లి ప్యాలెస్ కు కీలుబొమ్మలా మారి గంగిరెద్దు ఆడినట్లు ఆడుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: