రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయటంతో పాటు వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలి: కళా వెంకట్రావు
పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెదేపా నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో సౌర, పవన విద్యుత్ ఒప్పందాల్లో అవీనితి జరిగిందని చేసిన ఆరోపణల్ని 2 ఏళ్లు దాటినా నిరూపించలేకపోయారని గుర్తు చేశారు.
"మాటిచ్చి మోసగించడం జగన్ రెడ్డి దినచర్యగా మారింది. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు చెప్పి, అధికారంలోకి వచ్చిన 2ఏళ్లలోనే 3సార్లు ప్రజలపై భారం మోపారు. విద్యుత్ రంగంలో చంద్రబాబు సంస్కరణలు తీసుకొస్తే, కమీషన్ల కోసం 2ఏళ్లలోనే జగన్ రెడ్డి సంక్షోభంలోకి నెట్టారు. తెదేపా ప్రభుత్వ హయాంలో సౌర, పవన విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని చేసిన ఆరోపణల్ని 2ఏళ్లు దాటినా నిరూపించలేకపోయారు. పైసా కూడా ప్రజలపై భారం మోపకుండా మిగులు విద్యుత్ సాధించి కోతల్లేని నాణ్యమైన విద్యుత్ తెదేపా ప్రభుత్వం ఇచ్చింది. 5 ఏళ్ల పాలనలో విద్యుత్ రంగం 140అవార్డులు సాధించింది. వైకాపా అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలకు కరెంటు కోతలు, బిల్లుల మోతలు మిగిలాయి. ఇదే విధానం కొనసాగితే రోజుకు 4గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేరు. బొగ్గు సరఫరా సంస్థలకు పెండింగ్ బకాయిలు చెల్లించి థర్మల్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు చేపట్టాలి" అని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: