సొంత సామాజికవర్గ నేతల్ని 26కీలక సంస్థలకు ఛైర్మన్లుగా నియమించి.. అప్రాధాన్యత పదవులను బలహీన వర్గాలకు కట్టబెట్టడం సామాజిక న్యాయమా అని తెదేపా నేత జవహర్ నిలదీశారు. తితిదే ఛైర్మన్ పదవి మళ్లీ బాబాయికే కట్టబెట్టడం.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్దరించటం ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిధులు లేని కార్పొరేషన్లు, కుర్చీల్లేని ఛైర్మన్ల నియామకంతో.. సామాజిక న్యాయం ఎలా జరుగుతుందని నిలదీశారు. గతంలో ప్రకటించిన కార్పొరేషన్ కార్యాలయాల అడ్రస్లు ఎక్కడో కూడా ఇంత వరకు తెలియవని, ఇప్పుడు నియమించే పదవులకు ముందు కార్యాలయాల అడ్రస్ చెప్పి, ఆ తర్వాత ఛైర్మన్లను నియమించుకోవాలని సూచించారు. నిధులు, విధులు లేని ఛైర్మన్ల నియామకం.. ఉత్సవ విగ్రహాలతో సమానమని ఎద్దేవా చేశారు. ప్రజలకు భారంగా రాజకీయ నిరుద్యోగుల్ని మార్చటం తప్ప.. మరొకటి కాదని దుయ్యబట్టారు.
Jawahar: బలహీనవర్గాలకు అప్రాధాన్యత పదవులు కట్టబెట్టడం సామాజిక న్యాయమా? - తెదేపా నేత జవహర్ తాజా వార్తలు
నిధులు లేని కార్పొరేషన్లు, కుర్చీలు లేని ఛైర్మన్ల నియామకంతో.. సామాజిక న్యాయం ఎలా జరుగుతుందని తెదేపా నేత జవహర్ నిలదీశారు. సొంత సామాజికవర్గ నేతల్ని 26కీలక సంస్థలకు ఛైర్మన్లుగా నియమించి.. అప్రాధాన్యత పదవులను బలహీన వర్గాలకు కట్టబెట్టడం సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు.
నామినేటెడ్ పదవుల విషయంలో వైకాపాపై తెదేపా నేత జవహర్ మండిపాటు