ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుల బతుకులు అంధకారమయ్యాయి: గోరంట్ల

నకిలీ విత్తనాలు (Fake seeds), పురుగుమందుల వ్యాపారం చేసేది వైకాపా నేతలేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ (cm jagan) చెప్పే రైతు సంక్షేమం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు.

tdp leader gorantla on fake seeds
tdp leader gorantla on fake seeds

By

Published : Jul 8, 2021, 4:02 PM IST

నకిలీ విత్తనాలు (fake seeds), పురుగుమందుల వ్యాపారం చేసేది వైకాపా నేతలేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రభుత్వం చెప్తున్న రైతు దినోత్సవం రోజు రాష్ట్ర రైతుల బతుకులు అంధకారమయ్యాయన్నారు. మోసపూరత విధానాలు, దగా చేష్టలతో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. రైతుల పొలాలకు పారాల్సిన నీటిని కేసీఆర్ (KCR) విద్యుత్ ఉత్పత్తి పేరుతో సముద్రం పాలుచేస్తుంటే, జగన్ రెడ్డి చేతకాని వాడిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృష్ణా జలాల దుర్వినియోగంపై జగన్ రెడ్డి ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర కల్పన, విత్తనాలు, సూక్ష్మపోషకాలు, పంటల బీమా చెల్లింపులు ఇలా అనేక అంశాల్లో రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెదేపా(TDP) ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించిన అనేక పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details