ప్రభుత్వ మద్యం షాపుల్లో నాసిరకమైన మద్యాన్ని విక్రయిస్తూ.. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్డీపీ లిక్కర్‌ను తెస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు.
ఏడాది పాలనలో 13 లక్షల టన్నుల ఇసుకను వైకాపా నేతలు మాయం చేశారని ఆరోపించారు. అధికారులు ఇవ్వాల్సిన ఇసుక ఆన్లైన్ కూపన్లను.. వైకాపా నేతలే తమ ఇంటి వద్ద పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న వేల కోట్ల ఇసుక దోపిడీకి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.