సులభతర వాణిజ్య విధానాలు, సంస్కరణలు అంటే ఏమిటో ఈ ప్రభుత్వానికి తెలుసా అని మాజీ మంత్రి బండారు నిలదీశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కృషిని.. ఇప్పుడు తమదిగా చెప్పుకుంటున్న జగన్, ముందు తన ఆర్థికనేరాల సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు.
జగన్ క్విడ్ ప్రో కో ఫలితంగా ఇప్పటికీ ఐఏఎస్ లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రయ్యాక ఒక్క పరిశ్రమైనా రాష్ట్రానికి వచ్చిందా? అని ప్రశ్నించారు. కొడాలినాని లాంటి వారు మంత్రులైతే, ఏపీకి తొలిస్థానం వస్తుందా? అని బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు.