రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి శాసనమండలిలో తెదేపా 7 సవరణలు ప్రతిపాదించింది. తెదేపా శాసనసభ పక్షం ఈ మేరకు లేఖ విడుదల చేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం లెక్కలు ఆమోద యోగ్యంగా లేవని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానాలు తప్పు పట్టిన అంశాలను గవర్నర్ ప్రస్తావించడంపై ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నవరత్నాలపై తప్పుడు సమాచారం ఇచ్చారని... సవరణ కోరుతూ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌కు లేఖ ఇచ్చారు.
గవర్నర్ ప్రసంగంలో 7 సవరణలు ప్రతిపాదించిన తెదేపా - ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వార్తలు
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి శాసనమండలిలో తెదేపా శాసనసభ పక్షం 7 సవరణలు కోరుతూ...శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌కు లేఖ ఇచ్చింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు