సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని... ముగ్గురు తెలుగుదేశం సభ్యులపై వేటు వేసింది అధికార పక్షం. ప్రతిరోజూ ఈ ముగ్గురు ఏదో అంశంపై సభను గందరగోళపరుస్తున్నారని... సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు. దీనికి మిగతా సభ్యులు ఆమోదించడంతో వారిని ఈ సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి తెలిపారు.
ముగ్గురు తెలుగుదేశం శాసనసభ్యులపై వేటు
45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్ల అంశంపై ముగ్గురు తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్న సభలో రగడ రగిల్చింది. శాసనసభ నుంచి ముగ్గురు తెదేపా సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, రామానాయుడులపై వేటు పడింది.
ముగ్గురు తెలుగుదేశం శాసన సభ్యులపై వేటు
ఏం జరిగింది
45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్ల అంశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. తాము పింఛన్ ఇస్తామని చెప్పలేదని వైకాపా వాదిస్తుంటే... ఇచ్చారని మీడియాలో వచ్చిన వార్తలు చూపించారు తెలుగుదేశం సభ్యులు. తాము ఇచ్చిన వీడియోనూ ప్లే చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష సభ్యులు. ఇది జరుగుతుండగానే... సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... తెలుగుదేశం సభ్యులపై చర్యల ప్రతిపాదన తీసుకొచ్చారు.
Last Updated : Jul 23, 2019, 3:02 PM IST