ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Agriculture: రైతులకు అందని సాయం.. ఏటికేడు నిధుల్లో కోత - రైతులకు అందని సాయం వార్తలు

Agriculture: కేంద్ర పథకాల  కింద వచ్చే ప్రయోజనాలనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సక్రమంగా అందించడం లేదు. పలు పథకాలకు ఏటికేడు క్రమంగా నిధుల విడుదలను ఆపేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం రూపొందించిన అంచనాల్లో పదో శాతమే ఖర్చయింది.

Agriculture problems
రైతులకు అందని సాయం

By

Published : Apr 4, 2022, 8:07 AM IST

Agriculture: కేంద్ర పథకాల కింద వచ్చే ప్రయోజనాలనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సక్రమంగా అందించడం లేదు. పలు పథకాలకు ఏటికేడు క్రమంగా నిధుల విడుదలను ఆపేస్తోంది. 7 కేంద్ర ప్రాయోజిత పథకాలకు బడ్జెట్‌ లెక్కలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

*గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం రూపొందించిన అంచనాల్లో పదోశాతమే ఖర్చయింది. మొత్తం రూ.1771.56 కోట్లతో అంచనాలు వేయగా.. రూ.605 కోట్లే విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. అందులో ఖర్చు రూ.179 కోట్లే.

*2019-20 నుంచి ఇప్పటిదాకా 7 కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.4,073 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఖర్చయింది రూ.1,717.62 కోట్లే. అంటే మొత్తం అంచనాల్లో రూ.42శాతమే ఖర్చయింది.

*2022-23లో రాష్ట్రీయ కృషి వికాస యోజన మినహా చాలా పథకాలకు బడ్జెటే కేటాయించలేదు.

*2018-19లో కేంద్ర సహకారంతో అమలయ్యే యాంత్రీకరణ సబ్‌ మిషన్‌ (ఎస్‌ఎంఏఎం) పథకం కింద రూ.372 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ (రాష్ట్ర పథకం) కింద రూ.115 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసింది. పెద్ద ఎత్తున ట్రాక్టర్లతోపాటు వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక 2019-20లో ఈ పథకాలకు రూ.188 కోట్లే వెచ్చించింది. 2020-21లో అసలు ఖర్చే లేదు. 2021-22లో రూ.739 కోట్లతో అంచనాలు రూపొందించి రూ.235 కోట్లు విడుదల చేసినట్లు గణాంకాలు పేర్కొంటున్నా ఖర్చయింది రూ.48.54 కోట్లే.

*కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఏడింటి ఖర్చును పరిశీలిస్తే.. 2018-19లో రూ.1,202.66 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసింది. అదే పథకాలపై తర్వాత ఏడాది వైకాపా ప్రభుత్వ హయాంలో ఖర్చు రూ.780 కోట్లకు తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యయం రూ.179 కోట్లకు తగ్గింది.

ఇదీ చదవండి:

హస్తినకు అమరావతి అన్నదాతలు... నాలుగు రోజుల పాటు..

ABOUT THE AUTHOR

...view details