జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు బయల్దేరారు. జమ్మూ నుంచి శనివారం రాత్రి 12 గంటలకు అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన 90 మంది విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ రెల్వేస్టేషన్‌లో వీరికి ఏపీభవన్ అధికారులు భోజనాలు, మందులతోపాటు దారి ఖర్చుల కోసం కొంత నగదు అందించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ వారితో మాట్లాడారు. ఆదివారం రాత్రి 10 గంటలకు మరికొంతమంది తెలుగు విద్యార్థులు దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచనల మేరకు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ విద్యార్థులను కలిసి యోగక్షేమాలు కనుక్కున్నారు. అనంతరం వీరికి సదరన్ హోటల్లో బస ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు నేడు ఉదయం స్వస్థలాలకు పయనం కానున్నారు.
స్వస్థలాలకు శ్రీనగర్ ఎన్ఐటీ విద్యార్థులు
శ్రీనగర్ ఎన్ఐటీలోని తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు బయల్దేరారు. దిల్లీ రైల్వే స్టేషన్లో ఏపీ భవన్ సిబ్బంది విద్యార్థులకు భోజనాలు, మందుల సదుపాయం కల్పించారు.
స్వస్థలాలకు శ్రీనగర్ ఎన్ఐటీ విద్యార్థులు