SOUTHWEST MONSOON: వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఒకటీ, రెండు రోజుల్లో మళ్లీ పురోగమించే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రేపటిలోగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రపైకి రానున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆవరించి ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు రాగల రెండు మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.
SOUTHWEST MONSOON: రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు..! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
SOUTHWEST MONSOON:వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఒకటీ, రెండు రోజుల్లో మళ్లీ పురోగమించే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రేపటిలోగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రపైకి రానున్నట్టు వెల్లడించారు.
రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు..!