ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిలోనే రాజధాని ఉండాలి: సోము వీర్రాజు

రాజధాని, అవినీతి అంశాల్లో భాజపా స్పష్టమైన వైఖరితో ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని... వచ్చే రెండేళ్లలో తమ పార్టీ ఈ ప్రాంతంలోనే శాశ్వత కార్యాలయం నిర్మాణం పూర్తి చేసుకుంటుందని తెలిపారు.

అమరావతిలోనే రాజధాని ఉండాలి: సోము వీర్రాజు
అమరావతిలోనే రాజధాని ఉండాలి: సోము వీర్రాజు

By

Published : Oct 26, 2020, 2:42 PM IST

తెదేపా, వైకాపా కంటే అమరావతి విషయంలో తాము చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నామని సోము వీర్రాజు చెప్పారు. రాజధాని రైతులకు 64 వేల ప్లాట్లు వెంటనే ఇవ్వాలని.. రాజధాని గ్రామాల్లోని 9 వేల ఎకరాలు అభివృద్ధి చేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. జల రవాణా అభివృద్ధి కోసం బంకింగ్‌ హోం కెనాల్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని... విజయవాడ నుంచి గత ప్రభుత్వ హయాంలో తొలిదశ పనులు ప్రారంభించినా ఈ ప్రభుత్వం దానిమీద దృష్టి సారించలేదన్నారు.

ఆవ భూములు, హిందూ దేవాలయాలపై దాడులు, ఆలయ భూముల ఆక్రమణ అంశాల్లో భాజపా పోరాటం చేసిందని.. అవినీతిపై తెదేపా, వైకాపా రెంటిని సహించేది లేదని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల వినియోగంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతిపై భాజపా, జనసేన ప్రజా ఉద్యమం చేస్తాయన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్‌ను తక్కువ ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం నిర్మించి చూపించిందని... అప్పటి, ఇప్పటి ప్రభుత్వాలు ఎయిమ్స్‌కు రహదారికి కనీసం స్థలం ఇవ్వలేదన్నారు. రాయలసీమలో హైకోర్టు ఉండాలనే విధానానికి భాజపా కట్టుబడి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజధానికి కేటాయించిన నిధులకు చంద్రబాబు లెక్కలు చెప్పాలని, జగన్ ప్రభుత్వం గొప్పలు‌ చెప్పుకోవడం తప్ప..‌ చేతల్లో చూపించడం లేదని విమర్శించారు.

గత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సోము వీర్రాజు విమర్శించారు. తితిదే నుంచి డిపాజిట్ సొమ్ములు తీయవద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. వరదలపై పరిశీలించి... సాయం‌ చేయాలని లేఖ రాస్తే కేంద్రం వెంటనే స్పందించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైకాపా అనవసర రాద్ధాంతం‌ చేస్తోందని విమర్శించారు.

ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 45,149 కేసులు.. 480 మరణాలు

ABOUT THE AUTHOR

...view details