ETV Bharat / city
అమరావతి అందాలు చూతము రారండి!
అమరావతి సిటీ రైడ్స్ పేరుతో విజయవాడలో భారీ సైకిల్ ర్యాలీ జరిగింది. నవ్యాంధ్ర రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు వాటి విశిష్టతను ప్రజలకు తెలియజేయనున్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు చోదకులు.
అమరావతిలో భారీ సైకిల్ ర్యాలీ
By
Published : Feb 17, 2019, 10:59 AM IST
| Updated : Feb 17, 2019, 11:45 AM IST
అమరావతిలో భారీ సైకిల్ ర్యాలీ విజయవాడలో అమరావతి సిటీ రైడ్స్ పేరుతో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అమరావతి రన్నర్స్, సీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. తాత్కాలిక హైకోర్టు భవనం, ర్యాఫ్ట్ ఫౌండేషన్, అంబేద్కర్ స్మృతివనం, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వంటి నిర్మాణాల విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ర్యాలీని నిర్వహించినట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. దాదాపు 700 మంది ఔత్సాహికుల ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా వచ్చిన నగదును ప్రభుత్వ సంస్థ మై బ్రిక్ మై అమరావతి నిధికి అందించనున్నారు. అంతకు ముందు జమ్ము కశ్మీరులోని పుల్వామాలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. జవాన్ల కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ బెలూన్లు ఎగరవేశారు. ఇవి కూడా చదవండి.
Last Updated : Feb 17, 2019, 11:45 AM IST